సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఈటూరులో విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఏల వీరస్వామి( 65) అనే రైతు తన వ్యవసాయ బావి వద్ద మోటార్ వేయడానికి ప్రయత్నించగా... సర్వీస్ వైర్ లీకేజీ దగ్గర చేతికి తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
విద్యుదాఘాతంతో పొలంలోనే అన్నదాత మృతి - suryapet district news
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఈటూరులో చోటుచేసుకుంది.
విద్యుదాఘాతంతో రైతు మృతి
ఏఎస్ఐ వెంకన్న, వీఆర్వో సోమనర్సయ్య శవ పంచనామా నిర్వహించారు. అనంతరం శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: ద్విచక్రవాహనాన్ని ఢీకొన్ని ఇసుక లారీ... ఇద్దరు యువకుల మృతి