సూర్యాపేట జిల్లా నూతనకల్‌లో 3 లక్షల 19 వేల నగదును ఎన్నికల అధికారి స్వాధీనం చేసుకున్నారు. హుజూర్నగర్ ఉపఎన్నికల్లో భాగంగా... గురువారం నూతనకల్ మండల కేంద్రంలో తనిఖీలు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌కు చెందిన నగల దుకాణం యజమాని కారు ఆపి తనిఖీ చేయగా... 3.19 లక్షల నగదు దొరికింది. నగలు కొనుగోలు చేసేందుకు విజయవాడ వెళ్తున్నట్లు ఆధారాలు, నగదుకు సంబంధించిన రశీదులు చూపించినప్పటికీ... సీజ్ చేసి డీటీవోకు పంపినట్లు బాధితుడు ఆరోపించాడు.
నూతనకల్‌లో 3లక్షల 19 వేల నగదు పట్టివేత - నూతనకల్‌లో 3లక్షల 19 వేల నగదు పట్టివేత
సూర్యాపేట జిల్లాలో ఎన్నికల అధికారులు 3లక్షల 19 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నగదు సీజ్ చేసి డీటీవోకు పంపినట్లు అధికారులు తెలిపారు.
నూతనకల్‌లో 3లక్షల 19 వేల నగదు పట్టివేత