సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో 13 లక్షల వ్యయంతో ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ, గ్రామానికి వచ్చే ప్రధాన రహదారికి కల్వర్టు నిర్మాణానికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాద కిషోర్ కుమార్ శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు మూతపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు.
'గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు మూతపడకుండా కాపాడుకోవాలి'
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు మూత పడకుండా వాటిని కాపాడాల్సిన బాధ్యత గ్రామాల్లోని ప్రతి ఒక్కరిపై ఉందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. సూర్యాపేట జిల్లా చిల్పకుంట్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
'గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలను మూతపడకుండా కాపాడుకోవాలి'
నూతనకల్ మండల కేంద్రంలో ఓ ఫంక్షన్‌ను ప్రారంభించి తన గుర్తుగా ఒక మొక్కను నాటారు. అనంతరం జాజిరెడ్డిగూడెం కోడూరు గ్రామంలో శ్రీ కంట్లమహేశ్వర స్వామి ఉత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మాజి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆకట్టుకున్న కంబైన్డ్ పాసింగ్ పరేడ్.. విమానాల విన్యాసాలు