సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పాత రామచంద్రపురం తండాలోని పంటపొలాల్లో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. పంటపొలంలోని పురాతనమైన దేవాలయాన్ని కూల్చేసి... విగ్రహంతోపాటు విలువైన సామగ్రిని దొంగిలించారు. దేవస్థానాన్ని పూర్తిగా ధ్వసం చేసి దాదాపు 7 అడుగుల లోతు తవ్వి గుప్తా నిధుల కోసం వెతికారు. సుమారు రాత్రి 12 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు గ్రామస్థులు చెబుతున్నారు.
కృష్ణా పరివాహకంలో పురాతన దేవాలయంలో 'గుప్త' తవ్వకాలు - Destroyed the ancient temple for Gupta nidhulu at suryapet district
గుప్తనిధుల కోసం పురాతనమైన దేవాలయాన్ని తవ్వేశారు. విగ్రహంతో పాటు పలు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా పాత రామచంద్రపురం తండాలో చోటుచేసుకుంది.
గుప్తనిధుల కోసం పురాతన దేవాలయం ధ్వంసం
స్థానికులు పోలీసులకి సమాచారం అందించగా... ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. పూర్వకాలంలో కృష్ణ నది ఒడ్డున ఉన్న గ్రామంలో రాజులు ఉండేవారని... వారు కొన్ని చోట్ల నిధులు వదిలి వెళ్లారని ప్రజలు నమ్ముతారని స్థానికులు వివరించారు.