రక్తదానంపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రౌతు జయదేవ్ ఐదు రాష్ట్రాల్లో సైకిల్ యాత్ర కొనసాగిస్తూ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోకి అడుగు పెట్టారు. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రక్తదానం పై అవగాహన కల్పిస్తూ సైకిల్ యాత్ర చేపడుతున్నానని జయదేవ్ తెలిపారు.
రక్తదానంపై అవగాహన కల్పిస్తూ 9వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర - blood donation awareness
పశ్చిమ బెంగాల్‌కు చెందిన రౌతు జయదేవ్ రక్తదానంపై అవగాహన కల్పంచడం కోసం సైకిల్ యాత్ర చేస్తున్నాడు. ఐదు రాష్ట్రాల్లో పర్యటిస్తూ నేడు సూర్యాపేటకు చేరుకున్నాడు.
రక్తదాన అవగాహనపై 9వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర
గత సంవత్సరం నవంబర్ 7వ తేదీన కలకత్తా నుంచి 9 వేల కిలోమీటర్లు లక్ష్యంగా యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. అన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఇవీ చూడండి:ఛత్రపతి శివాజీకి ప్రధాని మోదీ నివాళి