తెలంగాణ

telangana

ETV Bharat / state

పులిచింతలలో మొసళ్ల హల్​చల్ - crcodile deid

పులిచింతల ప్రాజెక్టులో మొసళ్లు హల్​చల్​ చేస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజామున రోడ్డుపైకి వచ్చిన మొసలిని ఓ వాహనం తొక్కడం వల్ల మృతి చెందింది.

వాహనం కింద పడి మొసలి మృతి

By

Published : Aug 25, 2019, 3:11 PM IST

Updated : Aug 25, 2019, 4:31 PM IST

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టులో మొసళ్లు హల్​చల్ చేస్తున్నాయి. పది రోజుల క్రితం వరద నీరు రావడం వల్ల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని నిండుకుండలా కనిపిస్తోంది. ప్రస్తుతానికి సాగర్ నుంచి వరద ఉద్ధృతి లేనందున మొసళ్లు సంచరిస్తున్నాయి. అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి పర్యాటకులకు తగిన సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఒక మొసలి రోడ్డుపై సంచరిస్తుండగా అటుగా వచ్చిన భారీ వాహనం పై నుంచి వెళ్లడం వల్ల అక్కడికక్కడే చనిపోయింది. మొసలి చనిపోయిన సమాచారాన్ని స్థానికులు అటవీ శాఖ అధికారులకు తెలియపరిచారు.

వాహనం కింద పడి మొసలి మృతి
Last Updated : Aug 25, 2019, 4:31 PM IST

ABOUT THE AUTHOR

...view details