సూర్యాపేట జిల్లా నాగారం మండలం ప్రగతినగర్ రైతులు రాస్తారోకో నిర్వహించారు. సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేయడం లేదని నిరసన తెలిపారు. కనీస వసతులు లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి వర్షం కురుస్తుండటం వల్ల కేంద్రానికి తీసుకువచ్చిన పత్తి తడిచిపోయిందని ఆవేదన చెందారు.
సూర్యాపేటలో రోడ్డెక్కిన పత్తి రైతులు - cotton farmers protest at nagaram mandal
సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేయడం లేదని సూర్యాపేట జిల్లా నాగారం మండలం ప్రగతినగర్ రైతులు రాస్తారోకో నిర్వహించారు.
సూర్యాపేటలో రోడ్డెక్కిన పత్తి రైతులు
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. కేంద్రం నిర్వాహకులతో మాట్లాడి పత్తి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వగా రైతులు ఆందోళన విరమించారు.
- ఇదీ చూడండి : నిందితులు ఏం చేస్తున్నారో నిరంతర నిఘా