భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేట జిల్లా వాసి కల్నల్ సంతోష్ బాబు ప్రాణాలు వదిలారు. కాసేపట్లో భౌతికకాయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ హకీంపేట వైమానిక కేంద్రానికి చేరుకోనుంది. అక్కడి నుంచి సూర్యాపేట తరలించనున్నారు.
సూర్యాపేటలోనే కల్నల్ సంతోష్ అంత్యక్రియలు.. అధికారుల ఏర్పాట్లు - Colonel Santosh's funeral news
చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్‌బాబు (39) అమరుడవడంతో ఆయన స్వస్థలమైన సూర్యాపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇవాళ ఆయన స్వస్థలం సూర్యాపేటలో అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో చేపట్టనున్నారు.
సూర్యాపేటలోనే కల్నల్ సంతోష్ అంత్యక్రియలు..
సంతోశ్ బాబు అంత్యక్రియలకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితర ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉండటంతో భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. మధ్యాహ్నం వరకు భౌతికకాయం సూర్యాపేటకు చేరుకునే అవకాశం ఉండటంతో అందుకు తగినట్లు అంత్యక్రియలకూ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇదీ చూడండి:గాల్వన్ లోయకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?
Last Updated : Jun 17, 2020, 10:10 AM IST