చైనా సరిహద్దు గాల్వన్ లోయలో వీర మరణం పొందిన కర్నల్ సంతోష్ బాబు దశ దిన కర్మను సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో నిర్వహించారు. బంధువులు భారీగా హాజరయ్యారు.
కర్నల్ సంతోష్ బాబు దశదిన కర్మ.. హాజరైన మంత్రి జగదీశ్ రెడ్డి - కర్నల్ సంతోష్ బాబు దశదిన కర్మ
వీర మరణం పొందిన కర్నల్ సంతోష్ బాబు దశదిన కర్మను సూర్యాపేటలోని ఆయన స్వగ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీశ్ రెడ్డి హాజరై సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
colonel santhosh babu
స్థానిక ఎమ్మెల్యే, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై కర్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సంతోష్ బాబు జ్ఞాపకార్థం.. దశదిన కర్మకు వచ్చిన అతిథులకు భగవద్గీత పుస్తకాలను ప్రదానం చేశారు.
చదవండి:ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠినంగా వ్యవహరిస్తాం: మంత్రి కేటీఆర్