clash between MP Uttam and MLA Saidireddy followers: మొదట ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే ప్రజలకు రైతు బంధు, కల్యాణలక్ష్మి, దళితబంధు వంటి సంక్షేమ పథకాలు అందాయని, హుజూర్నగర్ అభివృద్ధి పథంలో నడిచిందని చెప్పారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందడం లేదని విమర్శించారు.
ఎంపీ ఉత్తమ్, ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం - Uttam Kumar Reddy and MLA Saidireddy
clash between MP Uttam and MLA Saidireddy followers: మేళ్లచెరువు మండల కేంద్రంలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం గోదాముల ప్రారంభోత్సవంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎంపీ, ఎమ్మెల్యే ఒకరి మీద ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకోవడంతో గొడవ మరింత ఉద్రిక్తతకు దారి తీసింది.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నలుగు సంవత్సరాలైనా.. ఇంత వరకు రైతు రుణమాఫీ చేయలేదన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో రహదారుల నిర్మాణం, కాలువలకు నీళ్లు తన హయాంలోనే అందాయన్నారు. అంతలోనే టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంపీ ఉత్తమ్ స్పీచ్‌కి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ.. జై సైదిరెడ్డి అంటూ నినాదాలు చేశారు. సహనం నశించిన ఉత్తమ్ తాను కూడా వందమందిని వెంటేసుకొని ఇంతకన్నా ఎక్కువ హంగామా చేయగలనని మండిపడ్డారు. ఇరు వర్గాల అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు.
ఇవీ చదవండి: