తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు రోడ్డు మార్గాన బయలుదేరారు. సమాచారం తెలుసుకున్న తెదేపా కార్యకర్తలు, అభిమానులు సూర్యాపేట జిల్లా కోదాడకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
చంద్రబాబుకు అడుగడుగునా అభిమానుల స్వాగతం - chandrababu naidu car journey at kodad
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు రోడ్డు మార్గాన వెళ్తున్న తరుణంలో తెదేపా కార్యకర్తలు, అభిమానులు సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికారు.
కారులో బాబు... కార్యకర్తల సందడి
చంద్రబాబు నాయుడికి పూలతో ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో రోడ్డుపై అభిమానులు, కార్యకర్తలతో ఆ ప్రాంతం సందడి వాతావరణం నెలకొంది. అభిమానుల కోసం ఐదు నిమిషాలపాటు చంద్రబాబు నాయుడు ఆగి.. కార్యకర్తలకు అభివాదం చేస్తూ వెళ్లిపోయారు.
ఇదీ చూడండి :తితిదే ఛైర్మన్‌కు భాజపా ఎంపీ రాకేశ్ సిన్హా లేఖ