సూర్యాపేట జిల్లాలో గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మోతె మండలం మామిళ్లగూడెం- విభలపురం గ్రామాల మద్య గండ్లచెరువు వాగు అలుగు పోస్తుండగా.. నీటి ప్రవాహం రహదారిపై నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సోమవారం రాత్రి ఉర్లగొండ గ్రామం నుంచి వస్తున్న కారు గండ్లచెరువువాగు వద్ద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది.
నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన కారు.. డ్రైవర్ సురక్షితం
రహదారిపై నీటి ప్రవాహానికి ఓ కారు కొట్టుకుపోయిన ఘటన సూర్యాపేట జిల్లా గండ్లచెరువు వద్ద జరిగింది. కారులో ఉన్న డ్రైవర్ లక్ష్మీకాంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. నీటి ప్రవాహంలో చిక్కుకున్న కారును బయటకు తీసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన కారు.. డ్రైవర్ సురక్షితం
ప్రమాదసమయంలో కారులో ఒక్కరు ఉన్నట్లు తెలుస్తోంది. కారులో ఉన్న వ్యక్తి నడిగూడెం మండలానికి చెందిన కాసాని లక్ష్మీకాంత్గా స్థానికులు గుర్తించారు. ఆయనకు ఈత రావడం వల్ల ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు. నీటి ప్రవాహంలో చిక్కుకున్న కారును బయటకు తీసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
TAGGED:
car drowned news at suryapet