తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్లాస్టిక్​ పరిశ్రమలో పేలుడు... ఒకరు మృతి - ప్లాస్టిక్​ పరిశ్రమలో పేలుడు

ఓ ప్లాస్టిక్​ పరిశ్రమలో పేలుడు సంభవించి ఒకరు మృతి చెందిన ఘటన సూర్యాపేటలో జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

పేలుడు

By

Published : Sep 13, 2019, 12:40 PM IST

సూర్యాపేటలో జాతీయ రహదారికి సమీపంలోని వెంకట సాయి ప్లాస్టిక్ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఇందులో పాత ప్లాస్టిక్ వస్తువులను సేకరించి వాటిని ముక్కలుగా చేస్తారు. ఒక డబ్బాను మిషన్​తో కొస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పేలుడు దాటికి పరిశ్రమ షెడ్ రేకులు ఎగిరిపోయాయి. గోడ కూలిపోయింది. అందులో పనిచేసే కార్మికులు బయటికి పరుగులు తీశారు. ప్రమాదంలో మధ్య ప్రదేశ్​కు చెందిన రామచంద్ర సాహూ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పేలుడు గల కారణాలు పోలీసులు విచారిస్తున్నారు.

ప్లాస్టిక్​ పరిశ్రమలో పేలుడు... ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details