సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపల్ అధికారులు కరోనా మృతదేహాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని... కరోనా సోకిన మృతదేహాలను శివారు ప్రాంతాల్లో ఖననం చేయాలని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా భాజపా కార్యకర్తలు ధర్నాకు దిగారు. కోదాడ పట్టణంలోని హిందూ స్మశానవాటికలో కరోనా మృతదేహాలను కాల్చి వేయకుండా, పూడ్చి పెట్టడాన్ని నిరసిస్తూ భాజపా కార్యకర్తలు ధర్నాకు దిగారు.
కరోనా మృతదేహాలను శివారు ప్రాంతాల్లో ఖననం చేయాలని ధర్నా
కరోనా సోకిన మృతదేహాలను శివారు ప్రాంతాల్లో ఖననం చేయాలని కోదాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట భాజపా కార్యకర్తలు ధర్నాకు దిగారు. కరోనా మృతదేహాల విషయంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
కరోనా మృతదేహాలను శివారు ప్రాంతాల్లో ఖననం చేయాలని ధర్నా
హిందూ స్మశానం చుట్టూ నివాసాలు, కాలేజీలు ఉన్నాయని.. జనావాసాల మధ్య కరోనా మృతదేహాలకు దహన సంస్కారాలు చేయొద్దని ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి కోదాడ పట్టణం శివారులో కరోనా మృతదేహాలకు దహన సంస్కారాలు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు వేలంగి రాజు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: తెలంగాణలోని కోర్టుల్లో సెప్టెంబర్ 5 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు