ముఖ్యమంత్రి కేసీఆర్ యాగాలు చేసినంత మాత్రాన... గొప్ప హిందువేమీ కాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. సూర్యాపేట బాలాజీ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. కులం మతం పేరుతో కాంగ్రెస్, తెరాస ఓటు రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. పౌరసత్వ బిల్లును రాజకీయ స్వార్థం కోసం విమర్శిస్తున్నాయన్నారు.
'యాగాలు చేస్తే కేసీఆర్ గొప్ప హిందువా?' - bjp latest news
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ పంక్షన్లో భాజపా కార్యకర్తల సమావేశానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హాజరయ్యారు.
దేశాన్ని విడగొట్టిన పాపం కాంగ్రెస్‌కే చెందుతుందని.. దేశ ప్రయోజనాలు కాంగ్రెస్‌కు పట్టవని విమర్శించారు. ఒవైసీ సోదరుల ఎజెండా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. గొప్ప హిందువునని చెప్పుకుంటున్నాడని విమర్శించారు. యాగం చేసినంత మాత్రాన గొప్ప హిందూవేమి కాదని... రావణాసురుడు కూడా యాగం చేశాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యజ్ఞయాగాలు చేసేది తెలంగాణ ప్రజల కోసం కాదని తన కుమారుని గట్టెక్కించేందుకే యాగం చేస్తున్నట్లు లక్ష్మణ్ ఆరోపించారు.
ఇదీ చూడండి: ఆగని రాక్షసత్వం: మతిలేని యువతిపై అమానవీయకాండ!