సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడుతండాలో ఈనెల 7న గిరిజన భరోసా యాత్ర చేపట్టనున్నట్లు భాజపా నేత, మాజీ మంత్రి రవీంద్రనాయక్ తెలిపారు. భాజపా రాష్ట్ర నాయకత్వం మొత్తం ఈ భరోసా యాత్రలో పాల్గొంటుందని చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ తన గుప్పిట్లో పెట్టుకున్నారని విమర్శించారు.
7న గుర్రంబోడుతండాలో భాజపా యాత్ర - బీజేపీ వార్తలు
ఈనెల 7న సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడుతండాలో భాజపా.. గిరిజన భరోసా యాత్ర చేపట్టనుంది. ఈ మేరకు ఆ పార్టీ నేత, మాజీ మంత్రి రవీంద్రనాయక్ హైదరాబాద్లో వివరాలు వెల్లడించారు.
గిరిజనులు భూమి హక్కు కలిగి.. సాగు చేసే భూములను తెరాస ఎమ్మెల్యేలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. గుర్రంబోడుతండాలో గిరిజనుల భూములను తెరాస నేతలు కబ్జా చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ద్రోహులకు కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని విమర్శించారు. పేదల భూములను ఆక్రమించుకుంటున్నారని మాజీ మంత్రి విజయ రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల కాంట్రాక్టులను ఆంధ్ర గుత్తేదారులకు కట్టబెడుతున్నారని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించే వరకు భాజపా పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:జనావాసంలోకి అడవి దున్న.. ఆందోళనలో ప్రజలు