భార్యను గొడ్డలితో నరికి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లాలోని నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రవీణ్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన కల్యాణి, ప్రవీణ్ ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి సంవత్సరం క్రితం వివాహం చేసుకున్నారు. అప్పుడప్పడు భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేవి. అవి కాస్తా తారా స్థాయికి చేరాయి.
భార్యను గొడ్డలితో నరికి హత్యాయత్నానికి పాల్పడ్డ భర్త - hospuital
సూర్యాపేట జిల్లాలోని చిల్పకుంట్ల గ్రామంలో దారుణం జరిగింది. ఓ భర్త భార్యను గొడ్డలితో నరికి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
2 నెలల క్రితం కల్యాణి సూర్యాపేటలో తల్లి గారింటికి వెళ్లింది. శనివారం ప్రవీణ్ తమ్ముని కొడుకు అన్నప్రాశన కార్యక్రమానికి భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విచక్షణ కోల్పోయిన ప్రవీణ్ భార్య తలపై గొడ్డలితో నరికడం వల్ల ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన బంధువులు సూర్యాపేటలోని ఓ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల కల్యాణిని హైదరాబాద్ తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివ కుమార్ వెల్లడించారు.
ఇవీ చూడండి: కరెంట్ స్తంభంపై చచ్చిబతికాడు