హైదరాబాద్లో ఉద్యోగులు తలపెట్టిన ధర్నాకు బయలుదేరిన ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని నేరేడుచర్ల మండల కేంద్రంలో సంఘటన జరిగింది.
ధర్నాకు వెళ్తున్న ఉపాధ్యాయుల అరెస్ట్
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. పీఆర్సీ, బదిలీలు, పదోన్నతుల సమస్యల సాధనకై హైదరాబాద్లో చేపట్టిన మహాధర్నాకు వెళ్తుండగా అడ్డుకున్నారు.
ధర్నాకు వెళ్తున్న ఉపాధ్యాయుల అరెస్ట్
పీఆర్సీ, బదిలీలు, పదోన్నతులు, ఇతర సమస్యల సాధనకై చేపట్టిన మహాధర్నాకు వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. దీంతో స్టేషన్లోనే ఆందోళనకు దిగారు. తమను హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు.