సూర్యాపేట జిల్లా అనంతగిరి ఎస్సై రామాంజనేయులుపై సస్పెన్షన్ వేటు పడింది. 2018లో నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణలో వాస్తవాలు నిర్ధరణ కావడంతో సస్పెండ్ చేశారని ఎస్పీ ఆర్.భాస్కరన్ బుధవారం తెలిపారు.
అనంతగిరి ఎస్సైపై సస్పెన్షన్ వేటు... వాస్తవాలు నిర్ధరణ - suryapet district latest news
సూర్యాపేట జిల్లా అనంతగిరి ఎస్సై రామాంజనేయులును సస్పెండ్ చేసినట్లు ఎస్పీ ఆర్.భాస్కరన్ తెలిపారు. ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరపగా... వాస్తవాలు నిర్ధరణ అయ్యాయని అందుకే సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. మండల పరిధిలో ఎస్సైపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు.
అనంతగిరి ఎస్సైపై వేటు... వాస్తవాలు నిర్ధరణ
మండలంలో ఎస్సైపై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని... అవినీతి ఆరోపణలు, అధికారుల ఆదేశాలను ఖాతరు చేయకపోవడం వంటి అంశాలు పరిగణలోకి తీసుకుని సస్పెండ్ చేసినట్లు ఓ ప్రకటనలో ఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి:ఓ ఇల్లాలి క్రైమ్ కథ.. భర్తను ఎందుకు చంపిందో తెలుసా..!