సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలానికి చెందిన రాజేష్ గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతన్నాడు. త్వరగా తన వ్యాధి నయం కావాలని తల్లి గిరిశెట్టి మంగమ్మ, మేనత్త ఎల్లమ్మ టీవీలో వచ్చిన ప్రకటనతో ప్రభావితమయ్యారు. చర్చికి వెళ్లి ప్రార్థన చేస్తే వ్యాధి నయమవుతుందనే మూఢ నమ్మకంతో బెల్లంపల్లి పట్టణంలోని చర్చికి గురువారం వెళ్లారు. అక్కడ మూడు రోజులపాటు చర్చిలో ఉండటం వల్ల శనివారం అతని ఆరోగ్యం క్షీణించింది.
విషయం చర్చి నిర్వహకులకు తెలుపగానే వారు ఆసుపత్రికి తీసుకెళ్తామని చర్చి వాహనంలో కొన ఊపిరితో ఉన్న రాజేష్‌ను వాహనంలో తరలించారు. నాలుగు గంటలపాటు బెల్లంపల్లి పరిసరాల్లో తిప్పుతూ కాలయాపన చేశారు. బాధితులకు అనుమానం వచ్చి వాహనాన్ని ఆపమని ప్రాధేయపడినా ఆపకపోవడం వల్ల కేకలు వేశారు. స్థానికులు వాహనాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ అసుపత్రికి తరలించగా అప్పటికే రాజేష్ మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న కాసిపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
'మూఢ నమ్మకాలతో వ్యక్తి మృతి'
మూఢనమ్మకాలతో రోగం తగ్గిపోతుందని మూడు రోజులు వైద్యసేవలు తీసుకోకుండా చర్చిలో ఉండి ప్రాణం కోల్పోయిన ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జరిగింది.
మూఢ నమ్మకాలతో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి
ఇవీ చూడండి : మాతృమూర్తి ఆశీర్వాదాలు తీసుకున్న మోదీ