సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా 13 లక్షల రూపాయల నగదు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్కి వెళ్తున్న ఇన్నోవా TS10 ES1449 నంబరు కారులో 13 లక్షల రూపాయలను గుర్తించారు. ఆ డబ్బుకు సంబంధించిన ధ్రువపత్రాలు లేనందున నగదును సీజ్ చేశారు. అనంతరం హుజూర్నగర్ తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. సదరు వ్యక్తి వినోద్ కుమార్ హైదరాబాద్కు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.
కోదాడలో రూ.13 లక్షల నగదు పట్టివేత - పట్టివేత
సూర్యాపేట జిల్లాలోని రూమాపురం చెక్పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 13 లక్షల రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు.
కోదాడలో రూ.13 లక్షల నగదు పట్టివేత