సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం దీపాయంపల్లికి చెందిన ఓ యువరైతు పొలం దున్నడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు. కనకరాజు(29)వరి నాటు కోసం పొలానికి వెళ్లి చదునుచేస్తున్న క్రమంలో కాలుజారీ పడిపోయాడు. ఈ క్రమంలో ముఖం బురదలో కూరుకుపోయి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు.
పొలానికి వెళ్లి.. తిరిగి రాని లోకాలకు చేరాడు.! - A young man went to plow a field and died
పొలంలో ప్రమాదవశాత్తు కాలు జారీ బురదలో పడి ముఖం ఇరుక్కుపోయి ఊపిరాడక ఓ యువరైతు మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దీపాయంపల్లిలో చోటుచేసుకుంది.
పొలానికి వెళ్లి.. తిరిగి రాని లోకాలకు చేరాడు
యువరైతు మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న భాజపా రాష్ట్ర కిసాన్ మెర్చా ఉపాధ్యక్షుడు తోట కమలాకర్ రెడ్డి యువ రైతు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తన వంతు సాయంగా రూ.5 వేల ఆర్థిక సహాయం మృతుని కుటుంబానికి అందజేశారు.
ఇదీ చూడండి :వాస్తు పేరుతో ప్రజాధనం వృథా చేస్తున్నారు : రేవంత్రెడ్డి