తెలంగాణ

telangana

ETV Bharat / state

రక్షకుడే శిక్షకుడు - sambhulimgam

విద్యార్థులకు రక్షణగా ఉండాల్సిన కాపాలదారే చితకబాదాడు. మద్యం మత్తులో గురుకుల విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

విద్యార్థులపై వాచ్​మెన్​ దుశ్చర్య

By

Published : Feb 11, 2019, 4:45 PM IST

విద్యార్థులను విచక్షణా రహితంగా కొట్టిన వాచ్​మెన్​
సిద్దిపేట జిల్లా దౌలతాబాద్​లో మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల వాచ్​మెన్​గా శంభులింగం విధులు నిర్వర్తిస్తున్నాడు. శనివారం రాత్రి మద్యం మత్తులో 120 మంది విద్యార్థులను విచక్షణ రహితంగా కొట్టాడు. ఒక విద్యార్థి వద్ద సెల్​ఫోన్ తీసుకున్న శంభులింగం... ఇవ్వమని అడగడంతో వాగ్వాదానికి దిగాడు. ఆ కోపాన్ని మనసులో పెట్టుకున్నాడు. రాత్రి 10 గంటలకు 120మంది విద్యార్థులను బయటికి పిలిచి వరుసలో నిలబెట్టి రాత్రి ఒంటిగంట వరకు విచక్షణ రహితంగా కొట్టాడు.
ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులు రావటంతో అసలు విషయం బయటకు పొక్కింది. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. వాచ్​మెన్​ను వెంటనే విధులనుంచి తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details