సిద్దిపేట మినీ పుర పోరు విజయంపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజలకు గల నమ్మకంతో ఈ విజయం సాధ్యమైందని ఆయన చెప్పారు. తెరాస ప్రవేశ పెట్టిన పథకాలు, అభివృద్ధి నినాదం గెలిచిందని పేర్కొన్నారు. విపక్షాలు ఎన్ని చెప్పినా ప్రజలు తెరాసకే పట్టం కట్టారని అన్నారు.
తెరాస అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపించాయి: హరీశ్ రావు - Telangana news today
తెరాస అభివృద్ధి, సంక్షేమ పథకాలే మినీ పురపోరులో తమకు విజయాన్ని కట్టబెట్టాయని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సిద్దిపేటకు ఇప్పటికే జాతీయ స్థాయిలో పేరు తెచ్చామన్న మంత్రి... భవిష్యత్‌లో మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. పుర విజయంపై ఆర్థిక మంత్రి హరీశ్ రావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి.
తెరాస అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపించాయి: హరీశ్ రావు
తెరాస నేతలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, అన్ని సమాయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండటం గెలుపుకు ప్రధాన కారణమని తెలిపారు. ఇప్పటికే సిద్దిపేట జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని... త్వరలో ప్రజల సహకారంతో ఇంకా అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి.. వారి ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి :మినీ పురపోరులో మరోసారి సత్తాచాటిన తెరాస