సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని పలు వీధుల్లో తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి కారు గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. సుజాతకు మద్దతుగా పార్టీ కార్యకర్తలు పలు సైతం ఇంటింటికీ తిరుగుతూ.. తెరాసను గెలిపించాలని కోరారు.
దుబ్బాకలో తెరాస ఇంటింటి ప్రచారం - trs compaign in dubbaka news
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తెరాస నాయకులు ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత ఇంటింటికీ తిరిగి.. కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలంటూ అభ్యర్థించారు.
దుబ్బాకలో తెరాస ఇంటింటి ప్రచారం
తెరాస అభ్యర్థి గెలిస్తే దుబ్బాక మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలకు వివరించారు. భాజపా, కాంగ్రెస్‌లు ఎన్నికల సమయంలో తప్ప... మళ్లీ కనిపించరంటూ ఎద్దేవా చేశారు. ఎప్పుడూ అందుబాటులో ఉండే సోలిపేట సుజాతకు ఓటు వేసి అసెంబ్లీకి పంపించాలని కోరారు.
ఇదీ చూడండి.. కార్మిక ఆత్మబంధువుకు కడసారి వీడ్కోలు... నేతల ఘననివాళి