ఎరువులు, విత్తన డీలర్లకు శిక్షణ - harish rao
పంటకు మందు వేయాలంటే అన్నదాతలు డీలర్లపైనే ఆధారపడతారు. అటువంటి డీలర్లకు నకిలీ ఎరువులు, విత్తనాలను గుర్తుపట్టడానికి సిద్దిపేట జిల్లాలో శిక్షణా తరగతులను ఏర్పాటు చేశారు .
HARISH RAO
రైతులు నష్టపోతే ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ మీద పడుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో ఎరువులు, విత్తన డీలర్ల శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఏ పంటకి ఎంత మోతాదులో ఎరువులు అందించాలో కూడా ఈ శిక్షణలో తెలియజేస్తారన్నారు. వ్యవసాయంలో వచ్చే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడంలో అధికారులు ముందు వరుసలో ఉండాలని హరీశ్ రావు సూచించారు.
HARISH RAO