సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో నిర్మిస్తున్న వంద పడకల ఆస్పత్రిని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. ఆస్పత్రిలో ప్రతి ప్రాంగణాన్ని పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. మరో నెల రోజుల్లో ఆస్పత్రిని ప్రారంభిస్తామని తెలిపారు.
వంద పడకల ఆస్పత్రిని పరిశీలించిన ఎంపీ - తెలంగాణ వార్తలు
దుబ్బాక పట్టణంలో నిర్మిస్తున్న వంద పడకల ఆస్పత్రిని ఎంపీ కొత్త ప్రభాకర్ సందర్శించారు. పనుల వివరాలపై ఆరా తీశారు. త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో కొవిడ్ వార్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రి
కొవిడ్ వార్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ వంద పడకల ఆస్పత్రికి సీఎస్ఆర్ నిధులతో డియాగో కంపెనీ సహకారంతో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం అతి త్వరలోనే చేపడతామని వెల్లడించారు.
ఇదీ చదవండి:పాఠాల కోసం పాట్లు- పండ్లు అమ్మితేనే స్మార్ట్ఫోన్!