సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో మూఢనమ్మకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఆకునూరు గ్రామానికి చెందిన నర్సింహులు అనే వ్యక్తి వద్ద సిరిసిల్ల జిల్లా కడకంచి గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు జోతిష్యం, వాస్తు పేరుతో గ్రామాల్లో తిరుగుతూ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి కొంత సొమ్మును కొల్లగొట్టారని దర్యాప్తులో తేలింది. నిందితుల వద్ద నుంచి 55వేల రూపాయలతో పాటు పూజ సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
సిద్దిపేటలో ప్రజల నమ్మకాన్ని ఆసరా చేసుకున్న ముఠా అరెస్ట్ - The arrest of a gang that has been promoting public confidence in Siddipet
తమకు అతీత శక్తులు ఉన్నాయని నమ్మబలుకుతూ సామాన్య ప్రజలను దోచుకుంటున్న ముఠాను చేర్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగదును పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
సిద్దిపేటలో ప్రజల నమ్మకాన్ని ఆసరా చేసుకున్న ముఠా అరెస్ట్