తెలంగాణ

telangana

ETV Bharat / state

భూములు ఇచ్చేది లేదు..! గుండవెళ్లి రైతులు....!

మల్లన్నసాగర్ కాలువ నిర్మాణం వల్ల తమ జీవనోపాదిని కోల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.పంట భూములు ప్రభుత్వానికి ఇచ్చేది లేదని రైతన్నలు తేల్చి చెప్తున్నారు. ప్రభుత్వం మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇస్తే భూములు ఇస్తామన్నారు.

భూములు ఇచ్చేది లేదు..! గుండవెళ్లి రైతులు....!

By

Published : Jun 28, 2019, 6:08 PM IST

మధ్య మానేరు నుంచి మల్లన్నసాగర్‌లోకి నీటిని తరలించేందుకు ప్రభుత్వం చేపట్టనున్న కాలువ నిర్మాణానికి తమ పంట పొలాలు ఇచ్చేది లేదని సిద్దిపేట గ్రామీణ మండలం చిన్నగుండవెల్లికి చెందిన పలువురు రైతులు స్పష్టం చేశారు. గురువారం గ్రామంలో తహసీల్దారు రమేష్‌ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలువ నిర్మాణంలో భాగంగా చిన్నగుండవెల్లిలో 200 మంది 135.36 ఎకరాలు కోల్పోతారని తహసీల్దారు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భూములను సేకరిస్తున్నామని చెప్పారు.

అనంతరం నిర్వాసితులు మాట్లాడుతూ.. కాలువ నిర్మాణానికి తమ భూములు ఇచ్చేది లేదని, సొరంగ మార్గం నిర్మిస్తే తమకు అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం ఇస్తే భూములు అప్పగిస్తామని వివరించారు. వ్యవసాయమే జీవనాధారంగా చేసుకొని బతులు వెళ్లదీస్తున్నామని కంటతడి పెట్టుకున్నారు. అంతకు ముందు నిర్వాసితులు కలెక్టరు రావాలి మాకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు శ్రీహరిగౌడ్‌, సర్పంచి రఘోత్తంరెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

ఇవి చూడండి. 'ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details