సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని శ్రీ సీవీ రామన్ ఉన్నత పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చూడచక్కని దుస్తులతో తయారై ఉపాధ్యాయ పాత్రలతో ఆకట్టుకున్నారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా వివిధ తరగతులకు ఒకరోజు విద్యాబోధన చేశారు. డీఈఓగా పీ అక్షయ, ఎంఈఓగా సాయిచేరణ్ ఒకరోజు బాధ్యతలు నిర్వర్తించారు.
హుస్నాబాద్‌లో ఘనంగా టీచర్స్ డే - హుస్నాబాద్
విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి... విద్యాబోధన చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో శ్రీ సీవీ రామన్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు