బ్రిటిష్ పాలకులు వెళ్లిపోవడంతో భారతదేశం స్వాంతంత్య్రం పొందింది. నిజాం ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఏడో నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో కలపడానికి నిరాకరించాడు. తనని స్వతంత్ర రాజుగా ప్రకటించుకుని పాలన కొనసాగించాడు. ప్రజల్లో స్వేచ్ఛాకాంక్ష పెరగడంతో.. మరింత నిరంకుశంగా వ్యవహరించాడు. దీనికి తోడు నిజాం సైన్నికాధికారి కాశీం రజ్వి వ్యక్తిగత సైన్యం రజాకార్ల అరాచకాలు పెచ్చిమీరి పోతున్నాయి. ప్రజల ఆస్తులతో పాటు మానప్రాణాలను దోచుకుంటున్నారు.
గ్రామ రక్షక దళాలు ఏర్పాటు
ఇలాంటి పరిస్థితుల్లో నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం మొదలైంది. సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యునిస్టు పార్టీ... పల్లెల్లో గ్రామ రక్షక దళాలు ఏర్పాటు చేసింది. చురకైన యువకులకు ఆయుధ శిక్షణ ఇచ్చి వారిని సాయుధులుగా మార్చింది. ఆయుధాలు పట్టిన రైతులు, కూలీలు, బడుగు బలహీనులు ప్రాణాలకు తెగించి పోరాడారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బైరాన్పల్లిలోనూ బలమైన గ్రామ రక్షక దళం ఏర్పడింది.
గ్రామాన్ని రక్షించుకోడానికి ఐక్యంగా
రజాకార్ల నుంచి తమ గ్రామాన్ని రక్షించుకోవాలన్న లక్ష్యంతో బైరాన్‌పల్లి గ్రామస్థులంతా ఐక్యమయ్యారు. శుత్రువులపై దాడి చేయడానికి గ్రామంలో శిథిలావస్థలో ఉన్న కోట బుర్జును పునర్ నిర్మాణం చేసుకున్నారు. నాటు తుపాకులు, మందు గుండు సామగ్రి సమకూర్చుకున్నారు. ఆయుధ శిక్షణ తీసుకున్న యువకులు.. నాటు తుపాకులతో గస్తీ నిర్వహించేవారు. బైరాన్‌పల్లికి సమీపంలో లింగాపూర్ గ్రామంపై రజాకార్లు దాడి చేసి ప్రజలను దోచుకోని వెళ్తున్నారు. దీన్ని గమనించిన బైరాన్‌పల్లి గ్రామ రక్షక దళం వారిపై దాడి చేసి.. సొత్తు స్వాధీనం చేసుకున్నారు. తిరిగి దానిని ప్రజలకు పంచిపెట్టారు.
మూడుసార్లు దాడి
దీంతో రజాకార్ల బైరాన్పల్లిపై ప్రతికారేచ్చతో రగిలిపోయారు. తమ కక్ష తీర్చుకోవడం కోసం గ్రామంపై దాడి చేశారు. గ్రామ రక్షక దళం గట్టిగా ప్రతిఘటించింది. ఈ దాడిలో 20 మందికి పైగా రజాకార్లు చనిపోయారు. రెండోసారి దాడి చేసిన రజాకార్లు గ్రామంలో అడుగు పెట్టలేకపోయారు. దీంతో కాసీం రజ్వీ పర్యవేక్షణలో మూడోసారి దాడికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 500 మందికి పైగా నిజాం సైనికులు, రజాకార్లు ఆయుధాలు, ఫిరంగులతో 27-08-1948 తెల్లవారుజామున గ్రామంపై దాడి చేశారు. కోట బూర్జుపై ఫిరంగులతో దాడి చేశారు. ఈ దాడిలో బూర్జులోని ఓ గదిలో నిల్వ చేసుకున్న మందుగుండు సామగ్రి పేలిపోవడంతో పాటు.. దానిపై నుంచి దాడి చేస్తున్న గ్రామ రక్షక సభ్యులు చనిపోయారు. దీంతో గ్రామం రజాకార్ల హస్తగతమైంది.
'ఆ రోజు జరిగిన చరిత్ర చూస్తనే తప్ప చెప్తే ఒడవది. మాపై మూడుసార్లు దాడి జరిగింది. రాత్రి 1 తర్వాత వచ్చి దాడి చేశారు. రజాకార్లు కాదు. పోలీసు వాళ్లే. ఇక వాళ్లు ఇష్టం వచ్చినట్లు చేశారు. ఇష్టం వచ్చినట్లు కొట్టారు. తిట్టారు. ఆడవాళ్లు బురుజు దగ్గర బట్టలు విడిపించి బతుకమ్మ ఆడించారు. లెంకలు పెట్టి చంపిండ్లు. ఐదు గంటల దాకా సాధించి అప్పుడు వెళ్లిండ్లు.'
- కొమురయ్య, స్వాతంత్య్ర సమరయోధుడు.
ఆకృత్యాలు