తెలంగాణ

telangana

ETV Bharat / state

హుస్నాబాద్ ఎస్సైని అభినందించిన కమిషనర్​ జోయల్​ డేవిస్​ - జాతీయ అవార్డుకు ఎన్నికైన హుస్నాబాద్​ ఎస్సై

జాతీయస్థాయి ఎన్సీఆర్బీ అవార్డుకు ఎన్నికైన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎస్సై శ్రీధర్​ను సీపీ జోయల్​ డేవిస్​ అభినందించారు. జిల్లా పోలీసులకు గుర్తింపు లభించినందుకు నగదు పురస్కారాన్ని అందించారు.

siddipeta police Commissioner Joel Davis congratulates husnabad si for selecting national awar
ఎస్సైని అభినందించిన కమిషనర్​ జోయల్​ డేవిస్​

By

Published : Dec 16, 2020, 10:56 PM IST

పోలీసుశాఖలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో అవార్డుకు ఎంపికైన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ ఎస్సై శ్రీధర్​ను సీపీ జోయల్​ డేవిస్​ ప్రశంసించారు. కేంద్ర మంత్రిత్వశాఖ అందించే ఎన్సీఆర్బీ ట్రోఫికి ఆయన ఎంపికయ్యారు.

జిల్లా పోలీసులకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించినందుకు ఎస్సైకి నగదు పురష్కారాన్ని సీపీ అందించారు. ఎస్సైని స్ఫూర్తిగా తీసుకుని అధికారులు, సిబ్బంది ఆధునిక సాంకేతికను వినియోగించుకుని అవార్డులు పొందాలని సీపీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్​ ఏసీపీ నారాయణ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ఓటుకు నోటు కేసులో నిందితుడు ఉదయ్‌సింహా అరెస్టు

ABOUT THE AUTHOR

...view details