సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని బంజేరుపల్లి గ్రామానికి చెందిన రైతు గంగం రాజిరెడ్డి సిద్దిపేట హుస్నాబాద్ ప్రధాన రహదారిపై వడ్లను ఆరబోశారు. వాహనదారులు, ప్రజలు వెళ్లే ప్రభుత్వ రహదారిపై రోడ్డుకడ్డంగా వడ్లను ఆరోబోనందుకు అతనిపై కేసు నమోదు చేసినట్టు ఏసీపీ మహేందర్, ఎస్ఐ సుధాకర్ తెలిపారు.
రోడ్డుపై ధాన్యం ఆరబోసిన రైతుపై కేసు - రాకపోకలకు ఆటంకం
ప్రజలు, వాహనాలు నడిచే రోడ్డుపై రాకపోకలకు ఇబ్బంది కలిగించే విధంగా వడ్లు ఆరబోసిన రైతుపై సిద్దిపేట హుస్నాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
రోడ్డుపై ధాన్యం ఆరబోసిన రైతుపై కేసు
రైతులు రోడ్డుపై ధాన్యాన్ని ఆరబెట్టొద్దని... దానివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. రాత్రి సమయంలో వాహనదారులు రోడ్డుపై వెళ్లేటప్పుడు ధాన్యం కుప్పలు కనపడక ప్రమాదానికి గురవుతున్నారని చెప్పారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని రోడ్డుపై ధాన్యం పోసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఏసీపీ మహేందర్ హెచ్చరించారు. ఇంటి వద్ద లేదా వరిచేలల్లో కల్లాలు ఏర్పాటు చేసుకుని ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలి రైతులకు ఆయన సూచించారు.
Last Updated : Apr 16, 2020, 12:13 PM IST