జహీరాబాద్ గ్రామీణ పోలీసు స్టేషన్లో డివిజన్ పోలీసు అధికారులు, సిబ్బందితో ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డయల్ 100పై సమీక్షించారు. బాధితులు ఫోన్ చేస్తే వెంటనే స్పందించి సహాయం అందించాలని ఆదేశించారు. బాధితులు స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు చేస్తే తమ పరిధి కాదని పంపకుండా సమస్యను పరిష్కరించాలని సూచించారు. అత్యవసర సమయంలో మాత్రమే 100 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు. సమావేశంలో డీఎస్పీ గణపథ్ జాదవ్, సీఐలు సైదేశ్వర్, కృష్ణ కిశోర్, జహీరాబాద్ పట్టణ, గ్రామీణ, చిరాగ్ పల్లి, హద్నూర్ ఝరాసంగం, రాయికోడ్ ఠాణా సిబ్బంది పాల్గొన్నారు.
డయల్ 100పై సిబ్బందితో ఎస్పీ సమీక్ష
ఆపద సమయంలో డయల్ 100కి ఫోన్ చేసి బాధితులు రక్షణ పొందాలని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సిబ్బందికి సూచించినట్లు తెలిపారు.
డయల్ 100పై సిబ్బందితో ఎస్పీ సమీక్ష