తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Dec 3, 2023, 12:23 PM IST

Updated : Dec 3, 2023, 6:05 PM IST

ETV Bharat / state

Siddipet, Telangana Elections Result 2023 Live : సిద్దిపేటలో హరీశ్​ రావు విజయం - మెజార్టీలో దూసుకెళ్లిన ఆరడుగుల బుల్లెట్

Siddipet, Telangana Elections Result 2023 Live : మంత్రి హరీశ్​రావు కంచుకోటగా సిద్దిపేట నియోజకవర్గంలో ఆయన మరోసారి తన హవా కొనసాగించారు. ఈ ఎన్నికల్లోనూ హరీశ్ రావు విజయం సాధించారు. మెజార్టీ మాత్రం గతంలో కంటే తగ్గింది.

Telangana Elections Result 2023
Telangana Assembly Elections Result 2023 Live

Siddipet, Telangana Elections Result 2023 Live : సిద్దిపేట ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి హరీశ్​ రావు విజయం సాధించారు. కాగా గతసారి ఎన్నికల్లో సాధించిన మెజార్టీ ఈసారి ఎన్నికల్లో రాలేదు. ప్రస్తుతం రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న హరీశ్​ రావు (Harish Rao) 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు మరోసారి రికార్డు మెజార్టీపై హరీశ్​రావు దృష్టి సారించారు.

హరీశ్​రావుకు వ్యతిరేకంగా కాంగ్రెస్​ (Congress) నుంచి విద్యార్థి ఉద్యమ నేపథ్యమున్న పూజల హరికృష్ణ, బీజేపీ (BJP) అభ్యర్థిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్​ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. సిద్దిపేటలో హరీశ్​రావుకు గట్టి పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో ఇరువురూ కృషి చేసినా ఫలితం లేకుండా పోయింది. రెండు సార్లు హ్యాట్రిక్ కొట్టిన హరీశ్ రావు ఈ ఎన్నికల్లో గెలిచి ఏడో విజయాన్ని అందుకున్నారు.

'బీఆర్ఎస్ ఎప్పటికీ సెక్యులర్‌ పార్టీనే - తల తెగిపడినా దిల్లీ నేతలకు తలవంచం'

Harish Rao Wins Siddipet Election 2023 : ఇక్కడ ప్రత్యర్థులకు గత ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. 1985 నుంచి కేసీఆర్, 2004లో ఉపఎన్నిక నుంచి ఆయన మేనల్లుడు హరీశ్​రావు వరుసగా సిద్దిపేటలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాదాపు 38 సంవత్సరాలుగా వారికి కంచుకోటగా ఉన్న నియోజకవర్గం అది. ఇక్కడ మూడు ఉపఎన్నికలతో కలిపి ఇప్పటివరకు హరీశ్ రావు డబుల్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. 2023 సంవత్సరంలో ఏడోసారి ఎన్నికల బరిలో నిలిచిన హరీశ్ రావు ఈసారి కూడా విజయం సాధించారు.

పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించిన బీఆర్​ఎస్ ​- హైదరాబాద్‌లోని వార్‌రూం నుంచి పర్యవేక్షణ

Harish Rao Wins Telangana Election 2023 :తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత హరీశ్​రావు మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయినా కూడా వారంలో మూడు రోజులు నియోజకవర్గంలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండడం హరీశ్​రావు ప్రత్యేకతగా విశ్లేషకులు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటుతోపాటు నియోజకవర్గానికి రైలు సదుపాయం, ఆధునిక రైతుబజారు, సమీకృత విపణి, ఐటీ హబ్​, రంగనాయక్ ​సాగర్​ జలాశయ నిర్మాణం, స్వచ్ఛ బడి, కోమటిచెరువు మినీ ట్యాంక్​ బండ్​ తదితర అభివృద్ధి పనులు ఆయన అధికారంలో ఉన్నప్పుడే సాకారమయ్యీయి.

రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దారనే పేరు హరీశ్ రావుకు ఉంది. ఇవన్నీ ఈసారి ఎన్నికల్లో ఆయన్ను గెలుపు దిశగా నడిపించాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందున ఈసారి సిద్దిపేట నియోజకవర్గంలో హరీశ్ రావు హవా కొనసాగుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. కాంగ్రెస్ హయాంలో ఆయన సిద్దిపేట అభివృద్ధి ఏ రకంగా కృషి చేస్తారో చూడాల్సి ఉంది.

Minister Harish Rao Speech at Medak Public Meeting : 'ఆ రాష్ట్రానికి ఒక నీతి.. మా రాష్ట్రానికి ఒక నీతా..' కేంద్రంపై హరీశ్​రావు ఫైర్

Last Updated : Dec 3, 2023, 6:05 PM IST

ABOUT THE AUTHOR

...view details