రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టిన సోదరీమణులకు సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు శానిటైజర్లు, మాస్కులు బహుమతిగా ఇచ్చారు. సోదరి క్షేమం కోరే సోదరుడిగా.. తన సోదరీమణులకు శానిటైజర్లు, మాస్కులు పంచినట్టు తెలిపారు.
రాఖీ బహుమతిగా మాస్క్, శానిటైజర్ ఇచ్చిన మున్సిపల్ ఛైర్మన్
రాఖీ పౌర్ణమి సందర్బంగా రాఖీ కట్టిన సోదరికి పట్టుచీరనో, నగదో, బంగారమో.. తనకు తోచిన ఏదో ఒక బహుమతి ఇస్తారు. కానీ.. సిద్ధిపేట మున్సిపాలిటీ ఛైర్మన్ రాజనర్సు శానిటైజర్, మాస్కులు బహుమతిగా ఇచ్చారు. కరోనా బారిన పడకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరు మాస్కు ధరించి, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలనే సందేశాన్ని చెప్పకనే చెప్పారు.
రాఖీ బహుమతిగా మాస్క్, శానిటైజర్ ఇచ్చిన మున్సిపల్ ఛైర్మన్
ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని మించిన విలువైన బహుమతి లేదని ఆయన అన్నారు. ప్రతీ ఒక్కరు మాస్కులు ధరించాలని, శానిటైజర్ వాడాలని సూచించారు. రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేసిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కూడా ఆయన శానిటైజర్ పంపిణీ చేశారు.
ఇదీ చూడండి :రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్