తెలంగాణ

telangana

ETV Bharat / state

'సురేశ్​ కుటుంబానికి న్యాయం జరగాలి' - students

మల్లన్నసాగర్ మధ్య కాల్వ పనుల్లో భాగంగా జరిగిన బ్లాస్టింగ్​లో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

విద్యార్థుల ఆందోళన

By

Published : May 18, 2019, 3:59 PM IST

ఏబీవీపీ ఆధ్వర్యంలో సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తాలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విద్యార్థి శవానికి అర్ధరాత్రి పోస్ట్ మార్టం చేసి... తరలించిన అధికారులపై చర్యలు తీసుకుని వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సురేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాంట్రాక్టర్ నుంచి బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం ఇప్పించాలని... ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. పోలీసులు నచ్చచెప్పడానికి యత్నించిన విద్యార్థులు వినలేదు. దీంతో వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.

విద్యార్థుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details