లాక్డౌన్ నేపథ్యంలో మెడికల్ ఎమర్జెన్సీ లేదా మరేదైనా అత్యవసరమైతే వేరే రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ-పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు జారీ చేస్తామని సిద్దిపేట కమిషనర్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లోనే అందజేసే ఈ-పాసులకు https://policeportal.tspolice.gov.in/అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చే వారికి సంబంధిత రాష్ట్రాలు పాసులు జారీ చేస్తాయని తెలిపారు. ఉదయం 6 నుంచి 10 గంటల లోపు ప్రయాణించే వారికి ఏ విధమైన పాసులు అవసరం లేదని స్పష్టం చేశారు.
'అత్యవసరమైతే ఈ-పాసులు జారీ చేస్తాం' - తెలంగాణ వార్తలు
లాక్డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు వెళ్లాల్సిన వారికి ప్రత్యేక పాసులు జారీ చేస్తామని సిద్దిపేట కమిషనర్ తెలిపారు. అందుకు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉదయం 6 నుంచి 10 గంటల లోపు ప్రయాణించే వారికి ఏ విధమైన పాసులు అవసరం లేదని స్పష్టం చేశారు.
ఈ పాసులపై కమిషనర్ వ్యాఖ్యలు. ఈ పాసులపై సిద్దిపేట కమిషనర్ వ్యాఖ్యలు
రాష్ట్రంలోని ఎక్కడి నుంచైనా వెబ్సైట్ ద్వారానే ఈ-పాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటించారు. దరఖాస్తు చేసుకున్నవారికి కమిషనర్ కార్యాలయం నుంచి పాసులు జారీ చేస్తామని తెలిపారు. పాస్‌ను ప్రింట్ తీసుకొని సంబంధిత వాహనాలకు ముందు అద్దం ఎడమవైపు అతికించుకోవాలని సూచించారు. ఎవరూ కమిషనరేట్‌కు రావొద్దని ఆదేశించారు.
ఇదీ చదవండి: త్వరలో కొవాగ్జిన్ ఉత్పత్తి రెట్టింపు