తెలంగాణ

telangana

ETV Bharat / state

'50 రోజుల్లో 1500 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి' - siddipet collector review

మల్లన్న సాగర్ ముంపు బాధితుల కోసం సిద్దిపేట జిల్లా గజ్వేల్​-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్ పల్లి శివారులో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మాణం చేస్తోందని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ కాలనీలో మొదటిదశలో భాగంగా 50 రోజుల్లో 1500 ఇళ్ల నిర్మాణం పనులు పూర్తి చేసి ఇవ్వాలని నిర్మాణ విభాగం అధికారులను కలెక్టర్​ ఆదేశించారు.

siddipet collector review on R&R colony construction in gajwel
'50 రోజుల్లో 1500 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి'

By

Published : Sep 5, 2020, 1:13 PM IST

మల్లన్న సాగర్​ ముంపు బాధితుల కోసం వచ్చే 50 రోజుల్లో 1500 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి అందించాలని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. సిద్ధిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్​లోని ముట్రాజ్​పల్లి ఆర్​ అండ్​ ఆర్​ కాలనీ వద్ద నిర్మాణ పనుల పురోగతిపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షించారు.

వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణ పనులు, వాటి తీరు తెన్నులు నిర్మాణ పనుల పురోగతిపై ఏజెన్సీలతో సుదీర్ఘంగా చర్చించారు. వచ్చే శుక్రవారం రోజున ముట్రాజ్ పల్లి ఆర్​ అండ్​ ఆర్​ కాలనీ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తానని... అప్పటిలోపు చేపట్టాల్సిన లక్ష్యాలకు అనుగుణంగా ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

కరోనా నేపథ్యంలో నిర్మాణ పనులు ఆలస్యమైన దృష్ట్యా... విడతల వారీగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఏజెన్సీలను కలెక్టర్ ఆదేశించారు. ముంపునకు గురైన గ్రామాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్మాణాలు వేగవంతం చేయాలని... అవసరమైతే అదనంగా కార్మికులను తెప్పించుకుని యుద్ధప్రాతిపదికన పనులు చేయించాలని ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు.

వచ్చే శుక్రవారం రోజున 6 తాగునీటి మిషన్ భగీరథ ట్యాoకు నిర్మాణాలను ప్రారంభించాలని ఆర్​డబ్ల్యూఎస్​ అధికారులకు సూచించారు. అదే విధంగా యూజీడీ, డ్రైనేజీ, రోడ్లు, మౌళిక వసతుల కల్పన, ఆర్చ్​ డిజైన్లు సిద్ధం చేయాలని ఏజెన్సీ ప్రతినిధులకు కలెక్టర్ సూచించారు.

కమ్యూనిటీ ఫంక్షన్ హాల్, దేవాలయాలు, మసీదు, చర్చి, మార్కెట్ నిర్మాణం చేపట్టే స్థలాలను త్వరలోనే అదనపు కలెక్టర్ పద్మాకర్​తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, ఆర్డీవోలు విజయేందర్ రెడ్డి, అనంత రెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్ఈ కనకరత్నం, పీఆర్ అధికారి రామచంద్రం, ఆర్​డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాస చారి, తహసీల్దార్​ అన్వర్, ఏజెన్సీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: జగ్గీ వాసుదేవ్​కు దత్తాత్రేయ జన్మదిన శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details