తెలంగాణ

telangana

ETV Bharat / state

చరిత్రలో నిలిచిపోవాలి: హరీశ్​ - SIDDIPETA DISTRICT

దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును శనివారం హరీశ్ రావు సందర్శించారు. ఏప్రిల్​ 4 లోపు రంగనాయక సాగర్ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శన హరీశ్ రావు

By

Published : Mar 10, 2019, 6:27 AM IST

Updated : Mar 10, 2019, 7:24 AM IST

ఏప్రిల్ నెలలోపు 4 పంప్ హౌస్ పనులు పూర్తి చేయాలని ఆదేశం
సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న రంగనాయక సాగర్ ప్రాజెక్టు పనులను మాజీ మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాతి కట్టడం, డెలివరీ సిస్టమ్ పనులు నెలలోపు పూర్తి చేయాలని ఆదేశించారు.

పనుల్లో వేగం పెంచండి

ఏప్రిల్ నెలలోపు 4 పంప్ హౌస్ పనులు పూర్తి చేయాలని సూచించారు. కాల్వల కోసం భూ సేకరణ చేపట్టాల్సి ఉన్నందున స్థానిక ప్రజా ప్రతినిధులకు రెవెన్యూ అధికారులు సహకరించాలని కోరారు. రిజర్వాయర్ పనుల్లో వేగం పెంచాలని నీటిపారుదల అధికారులకు సూచించారు. అనంతరం టన్నెల్​లోని పంప్​ హౌస్​ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఇవీ చూడండి:రేపు తెరాస శాసనసభాపక్ష సమావేశం

Last Updated : Mar 10, 2019, 7:24 AM IST

ABOUT THE AUTHOR

...view details