తెలంగాణ

telangana

ETV Bharat / state

అడవుల పునరుద్ధరణతో సత్ఫలితాలు: డీజీపీ - సిద్దిపేట జిల్లా తాజా సమాచారం

నాలుగేళ్ల క్రితం చేపట్టిన అడవుల పునరుద్ధరణ కార్యక్రమం సత్ఫలితాలిస్తోందని డీజీపీ మహేందర్​రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో సీనియర్ ఐపీఎస్​ల బృందంతో కలిసి ఆయన పర్యటించారు.

Senior IPS team visits gajwel with dgp mahenderreddy in siddipeta dist
గజ్వేల్​లో పర్యటించిన సీనియర్ ఐపీఎస్​ల బృందం

By

Published : Nov 18, 2020, 4:19 PM IST

Updated : Nov 18, 2020, 4:29 PM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో నాలుగేళ్ల క్రితం చేపట్టిన అడవుల పునరుద్ధరణ పనులను రాష్ట్రంలోని సీనియర్ ఐపీఎస్​ల బృందం పరిశీలించింది. వీరికి జిల్లా పాలనాధికారి వెంకట్ రామిరెడ్డి, సీపీ జోయల్​ డేవిస్ స్వాగతం పలికారు.

అటవీభూములను కాపాడాలనే ఉద్దేశంతో రూపొందించిన కార్యక్రమం మంచి ఫలితాలనిస్తోందని డీజీపీ మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అనంతరం ఓ కళాశాల ఆవరణలో మొక్కను నాటారు. గతంలో ఎడారిలా ఉండే గజ్వేల్ ఇప్పుడు పచ్చని చెట్లతో కళను సంతరించుకుందని తెలిపారు. కొండపోచమ్మ జలాశయం, కోమటిబండలో నిర్మించిన మిషన్​ భగీరథ నిర్మాణాన్ని సీనియర్ ఐపీఎస్​ల బృందంతో కలిసి డీజీపీ పరిశీలించారు.

ఇదీ చూడండి:ప్రమాణ స్వీకారం చేసిన కొత్త​ ఎమ్మెల్సీలు

Last Updated : Nov 18, 2020, 4:29 PM IST

ABOUT THE AUTHOR

...view details