రైతుల నుంచి సమాచారాన్ని సేకరించిన వ్యవసాయ అధికారులు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం అక్కన్నపేటలో ప్రభుత్వం చేపట్టిన రైతు సమగ్ర సమాచార సేకరణ ముగింపు దశకు చేరుకుంది. గత నెల రోజులుగా వ్యవసాయ అధికారులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి... అన్నదాతల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించారు. రైతులు నేల స్వభావాన్ని బట్టి పంటలు పండించేలా వారికి అవగాహన కల్పించడం, పంట కాలనీల ఏర్పాటు వంటి అంశాలపై ప్రోత్సహించేలా దీనిని చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
పంటలకు అనుగుణంగా మార్కెట్లు
మొత్తం 32 గ్రామాల్లో 8,422 మందికి సంబంధించి సమగ్ర సమాచార సేకరణ చేశామని వ్యవసాయ అధికారి నాగేందర్ తెలిపారు. రానున్న రోజుల్లో రైతులకు వారు పండించిన పంటలకు అనుగుణంగా మార్కెట్లను ఏర్పాటు చేయడానికే ఈ వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతు సమాచార సేకరణ వల్ల అన్నదాతలకు మేలు జరుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి : వట్టెం జలాశయ భూ నిర్వాసితులకు అండగా కాంగ్రెస్