సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని సంఘమిత్ర పీజీ కళాశాలలో హుస్నాబాద్ డివిజన్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు నన్నే అజయ్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, మున్సిపల్ ఛైర్మన్ ఆకుల రజిత, వైస్ ఛైర్మన్ అనిత, టీయూడబ్ల్యూజేయీ ( ఐజేయూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూతురు రాజిరెడ్డి పాల్గొన్నారు. హుస్నాబాద్, అక్కన్నపేట, కొహెడ, చిగురుమామిడి మండలాలకు చెందిన వర్కింగ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.
స్నేహపూర్వకంగా..
ఈ సమావేశంలో హుస్నాబాద్ డివిజన్ జర్నలిస్టుల సమస్యలను చర్చించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల మంజూరు విషయాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్, మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్తామని మున్సిపల్ చైర్మన్ రజిత హామీ ఇచ్చారు. పాత్రికేయులు, పోలీసులు మంచి స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండాలని హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ చెప్పారు. తన సర్వీస్ కాలంలో తన గురించి పాత్రికేయులు ఎన్నో వార్తలు ప్రచురించి సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారన్నారు.