సిద్దిపేట జిల్లాలోని పాములపర్తిలో అనుమానాస్పద స్థితిలో గర్భిణీ మృతిచెందింది. పాములపర్తికి చెందిన శిరిషాకు అదే గ్రామానికి చెందిన ప్రభాకర్‌కు ఇచ్చి సంవత్సరం క్రితం పెళ్లి చేశారు. వివాహం అనంతరం కుషాయిగూడలో నివాసముంటున్నారు. ఉగాది సందర్భంగా స్వగ్రామంకి వచ్చి అక్కడే ఉంటున్నారు.
అనుమానాస్పద స్థితిలో గర్భిణీ మృతి - గర్భిణీ అనుమానాస్పద మృతి
గర్భిణీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన పాములపర్తిలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో గర్భిణీ మృతి
ఈరోజు ఉదయం పక్కింటి వాళ్లు సంపులో పడి ఉన్న శిరిషాను చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వివాహం అయినప్పటి నుంచి ప్రభాకర్ అందంగా లేవని భార్యను వేధించినట్లు మృతురాలి తల్లిదండ్రులు వాపోయారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ నారాయణ తెలిపారు.
ఇవీచూడండి:కరోనాతో ప్రభుత్వ ఉద్యోగి మృతి.. తండ్రికీ సోకిన వైరస్