ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు మొక్కలు నాటారు. గజ్వేల్ సమీకృత కార్యాలయ భవనం ఆవరణంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపారు.
భారీ కేక్ కట్ చేసి... రక్తదానం చేసి... కేసీఆర్ పుట్టినరోజు - కేసీఆర్ జన్మదిన వేడుకలు
కేసీఆర్ జన్మదిన వేడుకలను ఆయన సొంత నియోజకవర్గంలో తెరాస నాయకులు ఘనంగా నిర్వహించారు. 66 కిలోల భారీ కేకును కట్ చేసి... శుభాకాంక్షలు తెలిపారు.
కేక్ కట్ చేసి... రక్తదానం చేసి...
అనంతరం రహదారులకు ఇరువైపులా కార్యకర్తలు మొక్కలు నాటారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో 66 కిలోల భారీ కేకును మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కట్ చేశారు. అనంతరం ఆసుపత్రిలో కార్యకర్తలు రక్తదానం చేశారు.
ఇవీ చూడండి:కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్, హరీశ్