తెలంగాణ

telangana

ETV Bharat / state

లీకైన భగీరథ, తాగునీరు వృథా

సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట గ్రామంలో మిషన్​ భగీరథ పైపులైన్ లీకైంది. దాదాపు మూడు గంటల పాటు నీరు వృథా అయింది. అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ సకాలంలో స్పందించలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ

By

Published : Mar 12, 2019, 5:12 PM IST

మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ అక్కన్నపేటలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకై ఉదయం 10 గంటల నుంచిమధ్యాహ్నం ఒకటిన్నర వరకు నీరు వృథాగా పోయింది. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహించారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వేసవికాలం ప్రారంభంలోనే గ్రామ ప్రజలు తాగునీటికి ఇక్కట్లు పడుతున్నారు.

తరచూ లీకేజీ...

ప్రజల తాగునీటి అవసరాల కోసం గ్రామపంచాయతీ నుండి వారం రోజులకు ఒకసారి నల్లా నీళ్లు వస్తాయి. కొంత మంది గృహిణులు లీకేజ్ అయిన చోట బిందెలతో నీరు తీసుకెళ్లారు. మరికొంత మంది మోటారు పంపు పెట్టి నీటిని ఇళ్లకు సరఫరా చేసుకున్నారు. పైపులు తరచూ లీక్ అవుతున్నాయని అలా జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుతున్నారు.

ఇవీ చదవండి:'తల్లిదండ్రుల పాత్రే కీలకం'

ABOUT THE AUTHOR

...view details