Pension Disbursement Program: సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో మండలంలో 1804 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన ఆసరా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలనెలా రూ.2016 ఆసరా ఫించన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దుబ్బాక పట్టణంలో 816, దుబ్బాక మండలంలో 988 మందికి ఆసరా పింఛన్లు, మొత్తం 1804 మందికి కొత్త పింఛన్లు ఇచ్చిన ఘనత కేవలం సీఎం కేసీఆర్‌కి దక్కుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక కన్న కొడుకులా.. రాష్ట్రానికే కాకుండా ఆసరా పింఛన్ ఇంటికి పెద్ద కొడుకులా సీఎం కేసీఆర్ రూ.2016 ఆసరా పింఛన్లు ఇవ్వడం అదృష్టం. తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మందికి, దుబ్బాక నియోజకవర్గంలో 50 వేల మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా మిగిలితే అర్హులైన వారందరికీ ఇస్తాం. ఈనెల నుంచి చేనేత కార్మికుడు మృతి చెందితే.. రూ.5లక్షల బీమా వర్తించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెచ్చింది.
దుబ్బాక నియోజకవర్గ వర్గానికి కొత్తగా 6 వేల ఆసరా పింఛన్లు. ప్రతీ పేదవారికి, అర్హుడికి అందేలా చూస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని.. సాగు, త్రాగు నీటి గోస పోయింది. రెండు నెలల నుంచి కూడెల్లి వాగు మత్తడి దూకుతున్నది. తెరాస ప్రభుత్వం వచ్చాక ప్రతీ వర్గాన్ని అక్కున్న చేర్చుకుని, ఆదుకుంటున్నది. గతంలో గ్రామాలకు ఎమ్మెల్యేలు వెళ్తే బిందెలతో అడ్డుకునేది. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేకుండా పోయింది. కొత్త ఆసరా పింఛను లబ్ధిదారులకు శుభాకాంక్షలు. -హరీశ్‌రావు ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి