సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం 1,470 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు.
గజ్వేల్లో కొవిడ్ నిబంధనల నడుమ ప్రశాంతంగా పోలింగ్ - తెలంగాణ వార్తలు
గజ్వేల్లో జరుగుతున్న ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కొవిడ్ నిబంధనల నడుమ ప్రశాంతంగా పోలింగ్
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మాస్క్ ధరించిన వారిని మాత్రమే ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు కల్పిస్తున్నారు.