రాష్ట్రంలో త్వరలో జరగనున్న దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికల్లో తెరాసకే ఓట్లు వేస్తామని ఓ పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేయడంపై పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్... కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం శివాజీనగర్ గ్రామ పంచాయతీ ప్రజలు తమ ఓట్లు తెరాసకే వేయాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు సర్పంచ్ శ్రీనివాస్... మంత్రి హరీశ్‌రావుకు లేఖ రాయడాన్ని ఆయన తప్పుబట్టారు.
'తెరాసకే ఓట్లు వేస్తామని అలా ఎలా తీర్మానిస్తారు'
సిద్దిపేట జిల్లా శివాజీనగర్ గ్రామ పంచాయతీ ప్రజలు తమ ఓట్లు తెరాసకు వేయాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు సర్పంచ్ శ్రీనివాస్... మంత్రి హరీశ్‌రావుకు లేఖ రాయడాన్ని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ తప్పుబట్టారు.
'తెరాసకే ఓట్లు వేస్తామని అలా ఎలా తీర్మానిస్తారు'
ఇది ఎన్నికల నియమావళికి పూర్తి వ్యతిరేకమని పేర్కొన్న పొన్నం... తెరాస తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని తెలిపారు. తక్షణమే తీర్మానం చేసిన పంచాయతీ సర్పంచిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాబోవు దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమ మార్గాల్లో గెలువాలన్న దృష్టితో తెరాస ముందుకెళుతోందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతోన్న వరద ఉద్ధృతి