దుబ్బాక ఉపఎన్నికల నుంచే తెరాస పాలనకు వ్యతిరేకంగా నిశ్శబ్ద విప్లవం మొదలైందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దౌల్తాబాద్, రాయపోల్ మండల కేంద్రాల్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్ ఆధ్వర్యంలో బూత్ కమిటీల సమావేశం ఏర్పాటు చేశారు.
హామీలు గుర్తుకు రావాలంటే.. తెరాసను ఓడించాలి: ఉత్తమ్ - మాణిక్కం ఠాగూర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బూతు కమిటీల సమావేశం
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కేసీఆర్కు గుర్తుకు రావాలంటే.. దుబ్బాకలో తెరాసను ఓడించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో భాగంగా... రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ అధ్వర్యంలో బూత్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు.
హామీలు గుర్తుకు రావాలంటే.. తెరాసను ఓడించాలి: ఉత్తమ్
గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బూత్ కమిటీ సభ్యులకు ఉత్తమ్ నిర్దేశించారు. మోసపూరిత మాటలతో ప్రజలను మభ్యపెడుతున్న తెరాసకు వ్యతిరేకంగా స్పందన వస్తోందన్నారు. హరీశ్ రావు ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. దుబ్బాకలో కాంగ్రెస్ గెలవడం ఖాయమన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలు గుర్తుకు రావాలంటే.. దుబ్బాకలో తెరాసను ఓడించాలన్నారు.
TAGGED:
manickam tagore in rayapole